చేతులను శుభ్రం చేసుకోవడం వల్ల చేతుల మీద ఉండే బ్యాక్టీరియా మరియు వైరస్ లాంటి సూక్ష్మజీవుల నుంచి మన శరీరానికి రక్షణ కలుగుతుంది. దీనికి కారణం ఏమిటంటే సబ్బుకు వైరస్ ని నాశనం చేసే అణుధర్మాలు ఉంటాయి. మన చేతులను సబ్బుతో కనీసం 20 సెకండ్ల పాటు కొళాయి వద్ద నుంచి కడుక్కోవాలి. ఇలా చేయడం వలన మన చేతికి అంటుకున్న కొన్ని వైరస్ లు నాశనం అయిపోతాయి. కరోనా వైరస్ కూడా మనం చేతులు కడుక్కున్న వెంటనే చనిపోయి సబ్బు నురగ లో వెళ్ళిపోతుంది.